Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

by CVR NEWS
వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌

మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదులు, డ్రగ్‌ లార్డ్స్‌కు ప్రపంచంలో ఎక్కడా ఆశ్రయం ఉండదంటూ ట్రంప్‌ హెచ్చరించారు.
వెనెజువెలాలో కార్యకలాపాలు సాగిస్తున్న డ్రగ్స్‌ ముఠా ట్రెన్‌ డి ఆరాగ్వాపై అమెరికా ఈ వారం ప్రారంభంలో కీలక ఆపరేషన్‌ నిర్వహించింది. అత్యంత విశ్వసనీయ సమాచారంతో ముఠా సభ్యులు తలదాచుకున్న ఓ కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేపట్టింది. ఈ దాడిలో గ్యాంగ్‌ లీడర్‌ హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ విడుదల చేసింది.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ.. “ట్రెన్‌ డి ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనెజువెలాలోనే కాదు, ఈ భూమ్మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదు. హంతకులు, డ్రగ్‌ లార్డ్స్‌ ఎక్కడున్నా వేటాడి న్యాయస్థానానికి తీసుకువస్తాం” అని వ్యాఖ్యానించారు.ఇప్పటికే ఈ ముఠాను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. హెక్టర్‌ గురెరో ఫ్లోర్స్‌ తలపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణా, హింసాత్మక నేరాల వెనుక ఈ గ్యాంగ్‌ హస్తం ఉందని ఆరోపిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: