115
దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు ప్రక్రియకు మరో రెండు రోజుల సమయం పడుతోందని దుబాయి ఎంబసీ అధికారులు తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అక్కడి నుంచి రషీద్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన సయ్యద్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని… తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.




Total views : 202967