హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ స్థానిక కంపెనీల్లో కార్మికులుగా చలామణి అవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు జీడిమెట్ల పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ ముఠాను పట్టుకున్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా దళారుల సహాయంతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలింది. నకిలీ గుర్తింపు కార్డులను చూపించి హైదరాబాద్‌లో ఇళ్లను అద్దెకు తీసుకోవడమే కాకుండా, స్థానిక పరిశ్రమల్లో ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యోగాలు సంపాదించారు. అక్రమ చొరబాటుదారులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు. అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
123




Total views : 202999