Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.

by CVR NEWS
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ

మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్‌షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించడంతో వారు దీక్షను విరమించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రస్తుతం చేనేత సహకార సంఘాల వద్ద సిద్ధంగా ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్లను 30 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: