Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Business మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

by CVR NEWS
మరోసారి CNG ధర పెంచిన కేంద్రం

వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు. దీంతో మూడ్రోజుల వ్యవధిలో CNG వాహనదారులపై 3 రూపాయల అదనపు భారం పడినట్లయింది.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో 100 రూపాయలకు చేరింది కిలో CNG ధర. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో 80, నోయిడా-గాజియాబాద్‌ ప్రాంతంలో రూ.88.70గా ఉండగా..ముంబైలో రూ.84 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్‌ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో గ్యాస్‌, చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ఉత్పత్తి, సరఫరా దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఫలితంగా దేశీయంగానూ ధరల పెంపు అనివార్యమైంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014621
Total views : 80618

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.