సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల సంఖ్య పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92వేల కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు వేగంగా న్యాయసేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తాజాగా.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య పెంపు అమల్లోకి వచ్చింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో తలెత్తే అదనపు ఖర్చును భారత సంఘటిత నిధి నుంచి సమకూరుస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లోపు నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు.
23





Total views : 80185