మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. ఈస్ట్ సెంట్రల్ స్టేట్ పుయెబ్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు దిగింది. ఈ ఘటనలో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులెవరు దీనివెనుక ఉన్న కారణాలేంటి అనే కోణంలో ఫెడరల్ పరిశోధనా సంస్థలు ఈకేసును దర్యాప్తు చేస్తున్నాయి. కొన్నినెలలుగా పుయోబ్లాలో హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురవ్వగా.. కొద్దిరోజులకే ఒక వాహనంపై జరిగిన సాయుధ దాడిలో మరో ఆరుగురు మరణించారు.
మెక్సికోలో దుండగుడి కాల్పులు..
143
previous post





Total views : 198730