వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై అందిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి భూ వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ప్రజావాణి వేదికగా నాసన్‌పల్లి తండా గ్రామస్థులు తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ తండాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలను రెండు గ్రూపులుగా విభజించి తీవ్ర వివక్ష చూపిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనకు నచ్చిన ఒకే గ్రూపునకు పనులు కల్పిస్తూ.. మరో గ్రూపునకు ఉపాధి పనులు చూపించకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. ఈ అన్యాయంపై స్థానిక ఎంపీడీవోకు, టెక్నికల్ అసిస్టెంట్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. అందుకే నేరుగా కలెక్టరేట్‌కు వచ్చామని తండావాసులు తెలిపారు. ఉపాధి కూలీల పొట్టకొడుతున్న సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌ను తక్షణమే విధుల నుండి తొలగించి, సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
25






Total views : 80833