Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

by CVR NEWS
శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు.దాదాపు రూ.2 కోట్ల 75 లక్షల భారీ వ్యయంతో ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ భవనాన్ని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేసిందని తెలిపారు. 2008లోనే ఈ పోలీస్ స్టేషన్‌కు మంజూరు లభించినా, 2018లో శంకుస్థాపన చేసినా.. గత ప్రభుత్వం పనులను గాలికొదిలేసిందని మంత్రులు విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023956
Total views : 143626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.