Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..

by CVR NEWS
హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం

భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము నుంచే ఉచ్చు బిగించారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. హైదరాబాద్‌తో పాటు ఏకకాలంలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మల్లాపూర్‌లోని జీఎం కుమార్ ప్రధాన నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. కేవలం కుమార్ ఇల్లే కాకుండా, ఆయన బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలోనూ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సోదాల్లో గుట్టలుగా దొరుకుతున్న నోట్ల కట్టలను చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే అవాక్కయ్యారు. ఇళ్లలో లభ్యమైన నగదును లెక్కించడానికి ఏకంగా కౌంటింగ్ మెషీన్లను రంగంలోకి దించారంటే అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన నగదు, ఆస్తుల డాక్యుమెంట్లపై దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆరా తీస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

023975
Total views : 143661

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.