చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది. ప్రముఖ మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సాంప్రదాయిక లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాశ్చాత్య దుస్తుల హడావుడి ఎక్కువగా ఉండే ఈ అంతర్జాతీయ వేదికపై, ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర అలంకరణతో దర్శనమిచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారదర్శకమైన ఎరుపు రంగు చీర కట్టు, నుదుటన పెద్ద బొట్టు, సాంప్రదాయిక జుడా , మహారాష్ట్రీయ ప్రత్యేక ఆభరణాలతో ప్రజక్తా ఎంతో హుందాగా, ఎలగంట్‌గా కనిపించింది. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఏడాది కేన్స్‌కు వెళ్లిన ప్రజక్తా మాలి.. అక్కడ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటిచెప్పింది. ఆమెకు సంబంధించిన ఈ సారీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ వేదికపై భారతీయ మూలాలను అద్భుతంగా ప్రదర్శించిందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట ఈ లుక్ ప్రస్తుతం “భారతీయ సౌందర్యం” అనే ట్యాగ్‌తో భారీగా ట్రెండ్ అవుతోంది.
చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.
36
previous post





Total views : 80904