Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

by CVR NEWS
ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌

భవిష్యత్‌ న్యూక్లియర్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్‌ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా’ సదస్సులో పాల్గొన్న లోకేష్‌.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో తదుపరి కీలక అధ్యాయం న్యూక్లియర్ ఎనర్జీ కాబోతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, తక్కువ ఖర్చుతో పోటీ సామర్థ్యం భారత్‌కు ఉన్న ప్రధాన బలాలని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని చెప్పారు. విశాఖను ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని.. రెన్యూవబుల్స్, గ్రీన్ హైడ్రోజన్‌, స్టోరేజ్‌, ట్రాన్స్‌మిషన్‌, తయారీ రంగాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023980
Total views : 143670

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.