బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పించటంపై ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్టు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
20
previous post





Total views : 80687