Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

by CVR NEWS
మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం

ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది.ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ టిడిపి తొత్తు లాగా మారారంటూ కలెక్టరేట్ హాల్‌లోనే వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో వైకాపా నాయకులకు నగర కమిషనర్ కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ అంతే ఘాటుగా స్పందించారు. ఎక్కువ మాట్లాడకండి అంటూ వైకాపా నాయకులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హాల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కలెక్టర్ వెట్రి సెల్వి జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించడంతో కమిషనర్ భాను ప్రతాప్ శాంతించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014804
Total views : 81060

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.