వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్‌లో ఒక వ్యక్తి సజీవ పాములను అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు రంగంలోకి దిగారు. కస్టమర్ల రూపంలో వెళ్లిన అధికారులు పక్కా ప్రణాళికతో డికాయ్ ఆపరేషన్ నిర్వహించి, సదరు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా… అంతర్జాతీయ మార్కెట్లో భారీ విలువ పలికే రెండు సజీవ ‘ఇండియన్ రెడ్ శాండ్ బోవా’ లభ్యమయ్యాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-I ప్రకారం ఈ జాతి పాములను ఉంచుకోవడం, రవాణా చేయడం లేదా వ్యాపారం చేయడం తీవ్రమైన నేరం. దీంతో స్వాధీనం చేసుకున్న పాములతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం వరంగల్ రేంజ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
25




Total views : 80287