Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

by CVR NEWS
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు

సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన వినూత్నంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు కాలుష్య నివారణే ధ్యేయంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలనే సందేశంతో క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆయనే స్వయంగా ఈ-స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా ‘నో వెహికల్ డే’ పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సాధారణ వ్యక్తిలా స్కూటర్‌పై రావడం చూసి కలెక్టరేట్ సిబ్బందితో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: