Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home International ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

by CVR NEWS
ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందన్న ఆరోపణలకు ఇప్పుడు కొత్త మలుపు తిప్పింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘డ్రాప్ సైట్’ బయటపెట్టినట్లు చెబుతున్న రహస్య దౌత్య పత్రాలు సంచలనం రేపుతున్నాయి.
()అమెరికా పరిశోధనాత్మక మీడియా సంస్థ డ్రాప్ సైట్ వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్న “సైఫర్” (రహస్య దౌత్య సందేశం) పత్రం నేపథ్యంలో, 2022లో పాకిస్థాన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ పత్రం ప్రకారం, 2022 మార్చిలో అమెరికా విదేశాంగ శాఖ అధికారి డోనాల్డ్ లూ – అమెరికాలోని అప్పటి పాక్ రాయబారి అసాద్ మజీద్ ఖాన్ మధ్య జరిగిన సమావేశంలో, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో.. రష్యాపై తీసుకున్న వైఖరిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ పత్రంలో పేర్కొన్నది. “ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తే వాషింగ్టన్‌లో అన్నీ క్షమించబడతాయి” అనే వ్యాఖ్య ఆ పత్రంలో ఉన్నట్లు చెప్పడంతో మరోసారి చర్చకు తెరలేపింది. ఈ అంశం “సైఫర్ కేసు”గా పాకిస్థాన్ రాజకీయాల్లో ఇప్పటికే పెద్ద వివాదంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ప్రభుత్వాన్ని విదేశీ కుట్రతో కూల్చివేశారని నిరంతరం ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అడియాలా జైలులులో నిర్బంధంలో ఉన్నారు.
() అయితే, మరోవైపు అప్పటి రాయబారి అసద్ మజీద్ ఖాన్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో “సైఫర్‌లో ‘కుట్ర’ లేదా ‘ముప్పు’ అనే పదాలు లేవు” అని చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా నివేదించినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ విషయమై ప్రస్తుతం బయటకు వచ్చిన పత్రాలపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా రాజకీయ ఒత్తిడి వల్లే ప్రభుత్వం కూలిందనీ ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ PTI వాదిస్తుండగా.. ఇది సాధారణ దౌత్య సంభాషణ మాత్రమే, కుట్రకు ఆధారాలు లేవని అమెరికా – పాకిస్థాన్ మాజీ అధికారుల వాదిస్తున్నారు.
()పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు, అలాగే పాకిస్థాన్ సైన్యం-రాజకీయ వ్యవస్థలపై పెరుగుతున్న అనుమానాలు. సోషల్ మీడియా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఈ అంశం విస్తృతంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

Advertisements

You may also like

Our Visitor

023967
Total views : 143642

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.