ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌లో ఉజ్జయినీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యోగ్‌నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షంటింగ్ చేస్తుండగా.. రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో ఆ రూట్‌లో వచ్చే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే..ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రిషీకేశ్ ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు ఉండి ఉంటే..పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు. రైల్వే శాఖ.. మరిన్ని సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెను ప్రమాదాలకు కారణమవుతాయి కాబట్టి.. ప్రయాణికుల సేఫ్టీ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..
33
previous post




Total views : 80909