Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

by CVR NEWS
దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఆ ట్రైన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జపాన్ సహకారంతో భారత్ నిర్మిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ తాజా వీడియోలో బుల్లెట్ రైలు ఎక్స్‌టీరియర్ ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ వైట్ కలర్స్‌తో ఉంది. వేగానికి అనుగుణంగా రూపొందించిన ట్రైన్ ముందు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ బుల్లెట్ రైలు గంటకు గరిష్టంగా 320 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. దీందతో ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాక్ నిర్మాణం, అండర్ వాటర్ టన్నెల్స్, స్టేషన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014649
Total views : 80691

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.