Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Business శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

by Rama
Karumuri Nageswar Rao

కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao):

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు నాడు నేడు ద్వారా మరింత మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యమన్నారు. ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే అని కొనియాడారు. పార్టీ ఓ కుటుబం లాంటిది. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటామని చెప్పిన ఆయన.. ఒకరిద్దరు భయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం అన్నారు. తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చిందని ఎద్దేవా చేశారు. నిజం జగన్… అబ్బద్ధం చంద్రబాబు… అని ప్రజలు అంటున్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారని కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారని తెలియజేశారు. Read Also..

  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
    నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014291
Total views : 79750

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.