Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home International యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

by CVR NEWS
యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి. అబుదాబి విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధానికి గౌరవ సూచికంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు డెలిగేషన్ స్థాయి చర్చలు జరిపారు. యూఏఈ ఒపెక్ నుండి వైదొలిగిన నేపథ్యంలో.. ఎల్పీజీ సరఫరా, పెట్రోలియం నిల్వలపై కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యూఏఈలోని 45 లక్షల మంది భారతీయుల సంక్షేమంపై కూడా చర్చించారు.

Advertisements

You may also like

Our Visitor

023976
Total views : 143662

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.