Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

by CVR NEWS
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ

నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల తవ్వకాలకు ట్రయల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రవరం మండల కేంద్రంలోని విజయ పాల డైరీ సమీపంతో పాటు ఎరుషలేము ప్రార్థనా మందిరం వద్ద కూడా బోరు బండ్లు తవ్వకాలు చేపడుతుండటంతో స్థానికుల్లో ఆసక్తి, ఆందోళన రెండూ వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అనుమతులతో హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులను చేపట్టారని చెబుతున్నారు. ఓఎన్‌జీసీ అనుమతులతో వివిధ గ్రామాల్లో శాటిలైట్ సూచించిన ప్రదేశాల్లో బోరు తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చమురు నిక్షేపాల అన్వేషణలో భాగంగా 80 అడుగుల నుంచి 200 అడుగుల లోతు వరకు తవ్వుతున్నట్లు వెల్లడించారు. సరైన సమాచారం ఇవ్వకుండా… అనుమతులు తీసుకోకుండా పంట పొలాల్లో తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహస్యంగా బోరు పనులు కొనసాగించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023980
Total views : 143670

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.