Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

by CVR NEWS
విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్లకు OTP అయితే వస్తోంది కానీ, ఆ OTP వచ్చి వారం రోజులు గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరడం లేదు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగితే స్టాక్ లేదనో, లోడ్ రాలేదనో సాకులు చెబుతూ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
​మరో దారుణమైన విషయం ఏమిటంటే.. మాడుగుల మండల కేంద్రానికి చెందిన వినియోగదారులను, వారి అనుమతి లేకుండానే పక్క మండలాల ఏజెన్సీలకు బదలాయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే గ్యాస్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించి, అనుమతి లేకుండా జరుగుతున్న బదలాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023955
Total views : 143624

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.