Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్..

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్..

by CVR NEWS
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ లను రాష్ట్రప్రభుత్వం నియమించింది. వీరి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగోల్ లో జరిగిన ఈ వేడుకకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరై శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, తదితరులు హాజరయ్యారు. బ్రాహ్మణులకు మంచి జరగాలనే ఉద్దేశ్యం తో సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం లో బ్రాహ్మణ సంక్షేమం సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్రాహ్మణులకు అన్ని రకాల లబ్ది చేకూరుతోందని అన్నారు మంత్రి సురేఖ. దేవాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు. రిటైర్డ్ అయిన బ్రాహ్మణులకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయని, 8 లక్షలకు పెంచుతామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

040874
Total views : 212257

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: