Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Crime సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

by CVR NEWS
సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు కలిచివేస్తున్నాయి. అతివేగంగా దూసుకు వచ్చిన స్కార్పియో కారు బస్సు కోసం రోడ్డుపై వెయిట్ చేస్తున్న మహిళలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గంభీరావుపేట మండలం రాజరాజేశ్వరావు కాలనీకి చెందిన మహిళలు గజ సింగవరం బస్టాండ్‌ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో రోడ్డుపై నిలబడ్డారు. ఐతే అతివేగంతో దూసుకొచ్చిన స్కార్పియో కారు ఆ బస్సును ఓవర్‌ టేక్ చేసే క్రమంలో ప్రయాణికుల పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోపాటు రజిత అనే మరో మహిళ చిన్న కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

023949
Total views : 143614

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.