Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న

మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న

by Satya
Pagiddaraju of Medara

సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను.. మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజాకార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళతారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పదిమంది పూజారులు, పలువురు భక్తులు పగడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద రాత్రికి విడిది కల్పిస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తామని ప్రధాన పూజారులు తెలిపారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.
    దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ…
  • శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.
    శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మూడ్రోజుల క్రితం అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ…
Advertisements

You may also like

Our Visitor

027067
Total views : 151526

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.