మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13కోట్ల25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.
Sammakka and Saralamma Jatara
Sammakka- Saralamma Jathara :
ములుగు జిల్లా మేడారం కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర వనితలైన వన దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు మేడారం జాతర పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనబడుతుంది. మేడారం జాతర జరిగే సమయంలో మావోయిస్టులు జాతర పరిసర ప్రాంతాల్లో సంచరించి వీర వనితలైన సమ్మక్క సారలమ్మలతో పాటు ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు కూడా నివాళులర్పిస్తారని గత కొన్నేండ్లుగా జాతర సమయంలో ప్రచారం జరుగుతుంటుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
సమ్మక్క కొలువైన చిలుకలగుట్టపై 2002 లో మావోయిస్టులు అమరవీరుల రెడీమెడ్ స్థూపాన్ని నిర్మించి అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించారు. అప్పటి నుంచి గడిచిన జాతరలలో ప్రతీ జాతరకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలలోకి వచ్చి ఏదో ఒక రకంగా తమ ఉనికిని చాటుకునే వారని జాతర సమయాల్లో ప్రచారం జరిగేది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్, సోమన్న, పటేల్ సుధాకర్‌రెడ్డి, యాదన్న, మధు తదితరులు మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలోనే మృతి చెందారు. రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయేందుకు మేడారాన్ని మావోయిస్టులు ఒక వేదికగా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది.
వీర వనితలకు, మావోయిస్టు అమరవీరులకు మేడారం జాతర సమయంలో మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో నివాళులర్పించేందుకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుందని భావించి అటవీ ప్రాంతాలతో పాటు చత్తీస్ గడ్ నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులతో కలిసి మావోయిస్టులు మేడారం వచ్చే అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, ముకునూరు, నీలంపల్లి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట నుండి మేడారం వెళ్లే వాహనాలపై, అటవీ ప్రాంతాలపై, ఫెర్రీ పాయింట్లపై పోలీసులు ప్రత్యే దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను.. మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజాకార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళతారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పదిమంది పూజారులు, పలువురు భక్తులు పగడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద రాత్రికి విడిది కల్పిస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తామని ప్రధాన పూజారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..by CVR NEWSయాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
- నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..by CVR NEWSప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా..నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి…
- కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..by CVR NEWSకేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. సుమారు 36 గంటల పాటు కనులవిందుగా సాగే…




Total views : 62173