Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Devotional బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

by CVR NEWS
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అమ్మవారి ఆలయంలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నా… కేవలం కంప్యూటర్ ఆపరేటర్లను మాత్రమే తీసుకోవడంపై యువకులు ఆలయ అధికారులను ప్రశ్నించారు. జీతం లేకుండా ట్రేనింగ్ కోసం మాత్రమే వారిని పెట్టుకున్నామని… వారు ఉచితంగా సేవలు చేస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఐదుగురు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. జీతంతో పాటు 19 వేల 500 అంటూ ఉన్న పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా పోస్టుకు అధికారులు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆలయంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో అమ్మవారి భక్తులు ఉన్నారు. ఇక దేవాదాయశాఖ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఈవో అంజనీ దేవి చెప్పడంతో మరింత గందరగోళానికి గురి అవుతున్నారు భక్తులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: