Friday, August 7, 2026
News Navigation
Friday, August 7, 2026
News Navigation

Breaking

Friday, August 7, 2026
Home Andhra Pradesh ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

by CVR NEWS
ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి వంతెన నడిపూడి వంతెనలను కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కు గజామాల తో స్వాగతం పలికారు ఎమ్మెల్యే ఆనందరావు, కూటమి నాయకులు. రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. కోనసీమ ప్రాంత రవాణా రంగానికి, రైతాంగానికి, వ్యాపారులకు వంతెనలు ఎంతో మేలు చేకూరుస్తాయని అన్నారు ఎమ్మెల్యే.. అమలాపురాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అమలాపురం రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: