Friday, August 7, 2026
News Navigation
Friday, August 7, 2026
News Navigation

Breaking

Friday, August 7, 2026
Home Latest News సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ తరలింపునకు డీకే అరుణ వినతి.

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ తరలింపునకు డీకే అరుణ వినతి.

by CVR NEWS

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సిద్ధాపూర్‌లో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఇతర ప్రాంతానికి తరలించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణకు సంబంధించిన జీవో-111 నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి బర్డ్ స్ట్రైక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని వివరించారు. స్థానిక రైతుల జీవనోపాధి, తాగునీటి వనరులు, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్‌ను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని డీకే అరుణ కోరారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: