Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Telangana తెలంగాణలో డయల్‌ 112తో అన్ని సేవలు.

తెలంగాణలో డయల్‌ 112తో అన్ని సేవలు.

by CVR NEWS

తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్‌ అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు పోలీసులకు 100, అంబులెన్స్‌, అగ్నిమాపక సేవలకు వేర్వేరు నంబర్లను ఉపయోగించగా, ఇక నుంచి వాటన్నింటికీ డయల్‌ 112 అమల్లోకి వచ్చింది. హైదరాబాద్‌లో కొత్త ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌ను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు.
కొత్త విధానంతో పోలీసు, అంబులెన్స్‌, అగ్నిమాపక సహా ఇతర అత్యవసర సేవలు ఒకే వేదికపైకి వస్తాయి. రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, గొడవలు, మహిళలపై వేధింపుల వంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేస్తే వెంటనే స్పందన లభించేలా వ్యవస్థను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కాల్స్‌ను పర్యవేక్షిస్తారు. 112కు ఫోన్‌ వచ్చిన వెంటనే కాలర్‌ వివరాలు, లొకేషన్‌ను గుర్తించి సమీప పోలీస్‌ స్టేషన్‌, అగ్నిమాపక సిబ్బంది, అవసరమైన బృందాలకు సమాచారం పంపిస్తారు. దీంతో సహాయక చర్యలు మరింత వేగంగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. డయల్‌ 112 సేవలు రోజుకు 24 గంటలు, ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మరింత విస్తృతంగా వినియోగించి అత్యవసర సేవల సామర్థ్యాన్ని పెంచాలని తెలంగాణ పోలీస్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: