Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

by CVR NEWS
మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు. కావేరి జలాల పంపిణీపై ఇప్పటికే ఉన్న నిబంధనలను ఉల్లంఘించే విధంగా కర్ణాటక వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటక చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మేకెదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని తమిళనాడు అసెంబ్లీ కోరింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026580
Total views : 150682

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.