Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

by CVR NEWS
భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం అయింది. వనమహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పలు పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా కిన్నెరసానిలో మూడు సరికొత్త సఫారీ వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు. పర్యాటకులకు కిన్నెరసాని అడవుల్లో పక్షులు, జింకలు, అడవి దున్నలు వంటి వన్యప్రాణులను నేరుగా వీక్షించే అవకాశం లభించనుంది. సఫారీ రైడ్‌తో పాటు అనుభవజ్ఞులైన గైడ్‌ల పర్యవేక్షణలో అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశాన్ని సైతం పర్యాటక శాఖ కల్పిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.
కిన్నెరసానిని మరింత అభివృద్ధి చేసేందుకు బటర్‌ఫ్లై పార్క్, ఫీడింగ్ సెంటర్, సిమెంట్ రోడ్లతో పాటు త్వరలోనే సరికొత్త బోట్లు, టూరిజం హోటల్, కాటేజీలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026797
Total views : 151104

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.