100
పాలిచ్చే తల్లులు మునగాకు తినడం ద్వారా పాలు బాగా పడతాయి. బాలింతలు, గర్భిణులు మునగాగాకు రసం తాగడం వలన వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా తల్లులతో పాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాల నుండి వచ్చే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు లో లభిస్తుంది. మునగాకు తినడం ద్వారా థైరాయిడ్ పనితీరు నియంత్రించుకోవచ్చు. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.