89
భారతీయ స్త్రీలకు మెనోపాస్ యొక్క సహజ వయస్సు 47 సంవత్సరాలు. పాశ్చాత్య దేశం అయిన అమెరికా లో 51 సంవత్సరాలు సగటు వయసు, .ఇది సహజం కాగా// కొందరిలో కృత్రిమ మెనోపాస్ రావచ్చు. అందుకు కారణం అండాశయాలను వైద్య కారణాల వలన తొలగించడం. కానీ సహజంగా అయితే 12 నెలల పాటు ఏకధాటిగా ఎప్పుడైతే పీరియడ్ రాదో దానిని మెనోపాస్ అంటారు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రధానమైనది. దీని వలన పునరుత్పత్తి కలిగి ఉంటారు, ఈ హార్మోన్ ఎప్పుడైటే తరుగుతూ పోతుందో అపుడు మెనోపాస్ గా పిలుస్తారు. ఈస్ట్రోజెన్ మన గుండె మరియు ఎముకలను రక్షిస్తాయి మరియు గుండెపోటులు, పగుళ్లు మరియు బోలు ఎముకల వ్యాధిని కూడా నివారిస్తాయి.