136
పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని, కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మరణిస్తుంది. దీనివల్ల పెరుగు తీసుకొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ ఎంతోమంది చెబుతుంటారు. కానీ ఇందులో అసలు వాస్తవమే లేదు.అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని చక్కగా తినొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.అయితే పెరుగుతో పాటు కలిపి తినకూడని పదార్థాలు కొన్నివున్నాయి. నెయ్యిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఆహారం జీర్ణమవదు.రాత్రి వేళ మన శరీరంలో కఫం ప్రాబల్యం ఉంటుంది. దీనివల్ల ముక్కు భాగాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. దగ్గు, ఆస్తమా, జలుబు చేసేవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.