బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పూజారికి పాము కాటు వేయడం కలకలం రేపుతుంది. సోమవారం అంతరాలయంలోని దత్తాత్రేయ మందిరంలో పూజలు నిర్వహిస్తున్న ప్రసాద్ పూజారికి పాము కాటు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పీహెచ్సీ సెంటర్ కు తరలించారు. అక్కడ సరైన వసతులు వైద్య సదుపాయం లేకపోవడం, పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం వారం రోజుల క్రితమే పాము సంచరించడానికి గమనించిన స్థానికులు పాముల పట్టే వ్యక్తి సహాయంతో చుట్టుపక్కల అడవిలో వదిలేశారు. వారం రోజుల రోజుల్లోనే మరొక పాము సంచరించడం, పూజారిని కాటు వేయడంతో అంతరాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఘట్టమైన గుట్టలు ఉండడంతో విష సర్పాలు సంచరించడం సర్వసాధారణమై అని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భక్తులు అధికారులు కోరుతున్నారు.
ఆలయ పూజారికి పాము కాటు
76
previous post