ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పరిహార శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీతాండవం చేస్తుంది. పూర్వం కాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు, వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్లు. వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికి మనం పాటిస్తున్నాం. ఒకఇల్లు బావుండాలన్న, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా.. ఆ ఇంటి ఇల్లాలు తీరు మూలకారణం అని చెప్తుంటారు..మహిళలు,ఎప్పటికి,చేయకూడని,పనులు మరి అవేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..
1) సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటని దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.
2) ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షము లోనే చేయాలి.. అంటేఅమావాస్య నుండి పౌర్ణర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదనిచెప్తుప్తున్నారు పండితులు..
3) ఆడవారు ఎప్పుడు దిండ్లు పై కూర్చోకూడదు.. ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడాఅలా దిండు మీద కూర్చోకూడదట..
3) ఇంట్లోని మగవారు మంగళ వారము నాడు క్షవరము చేసుకోవడం, గడ్డముగీసుకోవడము చేయనీయ వద్దుద్దు. ఇలా చేస్తేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే.. చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు.. కానీ అలా తీయరాదు.
4) ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినపుడు పలకిరించ వచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు.
5) కొత్త బట్టట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, పసుపు క్రిమి సంహారిణి
6) స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు
7) సువాసినీ స్త్రీలు నలుపురంగు వస్తువులను వాడటంగానీ, నలుపురంగు బట్టలను కట్టుకోవటంగానీ ఎప్పటికీ చేయకూడదు.
8) ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికానా ఇచ్చేటప్పుడు, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి.
9) అలాగే ప్రతి రోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి.. ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది.. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనంనంతర్వాత పెట్టాట్టాలి.
10) టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్లుళ్లు వుండే భాగము తాము ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.
11) స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు.. ఇది జ్యేష్టాదేవి స్వరూపముము. ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది.
12) అలాగే శుక్రవారమునాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పుకొనండి.. ఇలా చేయటం వలన సంపద వృద్ది కలుగుతుందని చెప్తారు..
13) ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకొని కుర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు.ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకుఅవకాశము కలదు.
14) ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచేపుడు కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతినిఉపయోగించ కూడదు.
15) సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదుదు.
16) స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తల్లో ధరించరాదు.. అట్టిసమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా… పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా.. వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి.
17) ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటె శ్రాద్ధము ముగిసేవరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి.
18) ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడు కూడా పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనేపదాలు వినిపించకూడదు..
19) ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా
ఉంచుకోవాలి..
20) ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి
21) ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.
22) మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు. అందుకేచీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్నచిన్న కిటుకులు పాటిస్తేస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖసంతోషాలతో వెలిగిపోతుంది.