డార్క్ చాక్లెట్ రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు, గుండెకు మేలు చేస్తున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇదెలా జరుగుతుందోననేది మాత్రం తెలియదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇందులోని గుట్టును ఛేదించారు. కోకో గింజల్లోని పీచు మన పేగుల్లో ఎలా పులుస్తుందో, ఎలా మేలు చేస్తుందో గుర్తించారు. మన పేగుల్లో హానికర బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. బైఫైడోబ్యాక్టీరియం, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వంటి మేలు చేసే సూక్ష్మక్రిములు చాక్లెట్‌ను ఆహారంగా తీసుకొని.. దాన్ని పులియబెడుతున్నట్టు తేలింది. అనంతరం అందులోంచి వాపు నివారక రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు బయటపడింది. సహజ సిద్ధంగా పుట్టుకొచ్చిన ఈ వాపు నివారక రసాయనాలు రక్తంలో కలిసి గుండె కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తపోటు ముప్పు తగ్గుతుందన్నమాట. కోకో గింజల్లో క్యాటెచిన్, ఎపిక్యాటెచిన్ వంటి ఫాలీఫెనాల్స్‌తో పాటు కొద్దిమొత్తంలో పీచూ ఉంటుంది. నిజానికి ఈ ఫాలీఫెనాల్స్ ఆలస్యంగా జీర్ణమవుతాయి. కానీ పెద్దపేగులోని మంచి బ్యాక్టీరియా పీచును పులిసేలా చేసి, ఫాలీఫెనాల్స్‌ను త్వరగా చిన్న చిన్న అణువులుగా మారుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డార్క్ చాక్లెట్‌కు దానిమ్మ వంటి పండ్లు కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతుందని వివరిస్తున్నారు.
చాక్లెట్..గుండెకు మేలు
96
previous post