బీర్ అనగానే మందుబాబులకు తాగాలనిపిస్తుంది. అయితే సాధారణంగా వారానికి రెండుసార్లు బీర్ తీసుకుంటే లావవుతారని కొందరి అపోహ. బీర్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మాంసాన్ని మారినేట్ చేసేటప్పుడు అంటే మసాలా పట్టించి నానపెట్టేటప్పుడు బీర్ వాడి చూడండి. రుచిగా ఉండడమే కాకుండా ముక్కలు మృదువుగా ఉంటాయి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగేయండి. ఈ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్ పొట్టలో ఇబ్బందిని సరిచేయడమే కాకుండా ఇందులో ఉండే ఆల్కహాల్ నొప్పిని తగ్గించేందుకు పనిచేస్తుంది. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ ఉన్నవారు దీనిని వాడవద్దు. ఒక శుభ్రమైన బట్టను బీర్‌లో ముంచి బంగారం నగలను తుడిచి ఆ తరువాత పొడి బట్టతో మరోసారి తుడిచి ఆరపెడితే మిలమిలా మెరవడం ఖాయం. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఈస్ట్‌ది ప్రధానపాత్ర. ఇది బీర్‌లో ఉంటుంది కాబట్టి నీళ్లలో కొంచెం బీర్ పోసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండడమే కాకుండా మెరుస్తుంది కూడా. రొయ్యల్ని వండేటప్పుడు బీర్ కలిపితే మంచి రుచి వస్తుంది. బీర్‌ని మిగతా వంటల్లో కూడా వాడొచ్చు. అయితే బీర్ వేశాక ఎక్కువసేపు ఉడికించకూడదు.
బీర్ ప్రయోజనాలు..
70
previous post