శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మండల పూజ సీజన్ సందర్భంగా రెండు నెలల పాటు ఆ ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. అయ్యప్ప ఆలయం ఈసారి భక్తుల్ని విశేషంగా ఆకర్షించనున్నది. ఆలయ ఎంట్రెన్స్‌లో కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఆ శిలలు భక్తుల్ని సమ్మోహన పరచనున్నాయి. ప్రస్తుతం ఆలయం ప్రవేశ ద్వారం వద్ద హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ 70 లక్షలు కేటాయించింది. శిలలపై అందమైన బొమ్మను చెక్కారు. స్వామియే శరణం అయ్యప్ప అని ఆ పిల్లర్స్‌పై కార్వింగ్ చేశారు. ఆలయంలోని 18 బంగారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. వర్షం లేని సమయంలో ఆ రూఫ్‌ను ఫోల్డ్ చేసే రీతిలో తయారు చేశారు. చెన్నైకి చెందిన క్యాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది. పడి పూజ సమయంలో ఆ రూఫ్ వల్ల ఇబ్బంది ఉండదని ఆలయ అధికారులు చెబుతున్నారు. మండల దీక్ష కోసం ఆలయాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. డిసెంబర్ 27వ తేదీన ఆ సీజన్ ముగుస్తింది. మకర సంక్రమణ పండుగ కోసం డిసెంబర్ 30వ తేదీన మళ్లీ ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. జనవరి 15వ తేదీన భారీ సంఖ్యలో భక్తుల్ని ఆలయ దర్శనం చేసుకోనున్నారు.
Read Also..
Read Also..