ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి. పెదాలు దొండపండులా ఎర్రగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, అలా కాకుండా కొన్ని కారణాల వల్ల పెదాలు నల్లగా మారతాయి. అలా కాకుండా ఏం చేయాలో తెలుసుకోండి. ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి. ఎదుటివారిని చూడగానే ఆకర్షించేవాటిలో నవ్వు ముందుంటుంది. చక్కని దంతాలు, చూడచక్కని పెదాలు చిరునవ్వుని అందంగా చేస్తుంది. అలాంటప్పుడు పెదాలు ఎర్రగా ఉంటే చిరునవ్వు మరింత అందంగా ఉంటుంది. కానీ, చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి. అలా కాకుండా పెదాలు ఎర్రగా కనిపించాలంటే ఓ మాస్క్ బాగా పనిచేస్తుంది. ఆ మాస్క్‌ని ఎలా తయారు ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె, పసుపు, కొద్దిగా పంచదార పొడిలా చేసి వేయాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం కలపి పేస్టులా చేయాలి. దీనిని పెదాలకి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. తర్వాత టూత్‌బ్రష్‌తో పెదాలను సున్నితంగా మసాజ్ చేస్తే నలుపు తగ్గి పెదాలు మృదువుగా అందంగా మారతాయి. నిమ్మరసం అనేది చర్మానికి మేలు చేస్తుంది. నల్లమచ్చల్ని తగ్గించి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఇది పెదాలపై ఉన్న నలుపుని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు బ్లీచింగ్ ప్రభావాలు ఉంటాయి. దీంతో ఇది పెదాల నలుపుని దూరం చేస్తుంది.
నల్లని పెదాలు ఎర్రగా..!
75
previous post