86
ఆకుకూరలు, ఎండుఫలాలు, కాయధాన్యములు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యములు కూడా ఇనుముకు చక్కని ఆధారాలు. ఐతే ఆకుకూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం ఇనుమును మత్రమే శరీరం గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. మాంసము, చేపలు, కోడి మాంసము/గుడ్డు నుంచి కూడా శరీరం ఇనుమును గ్రహిస్తుంది. ఆకుకూరల ద్వారా లభించే ఇనుము శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి విటమిన్ సి పండ్లు తోడ్పడతాయి. ఇనుము కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి.
Read Also..
Read Also..