చాలా మందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు. దీని వల్ల కడుపులో హాయిగా ఉందనుకుంటారు. కానీ, కొన్ని సమస్యలున్నాయి. అవేంటో తెలుసుకోండి. ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు చాలా మంది సోడా, కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దీని వల్ల కడుపులో కాస్తా రిలాక్స్‌గా ఉన్నట్లుగా త్రేన్పులు వస్తాయి. అప్పటికప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. కానీ, తర్వాత కొన్ని సమస్యలొస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకోండి. భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ, ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది. దీంతో పాటు చాలా సమస్యలొస్తాయి. కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. దీంతో కూర్చోలేరు, నించోలేరు ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది, అదే విధంగా తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే, వీటిని తాగకపోవడమే మంచిది. తిన్న తర్వాత వేడినీరు తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు తాగడం మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు
భోజనం తరువాత సోడా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..!
66
previous post