ఫేస్‌పై మచ్చలు, మొటిమలు లేకుండా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందమైన స్కిన్ కావాలంటే కేవలం రెండు పదార్థాలు చాలు. అవేంటో చూద్దాం. పాలు ఇవి ఆరోగ్యానికి మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు. పాలని వాడడం వల్ల అందం కూడా మెరుగవుతుంది. అందులో ముఖ్యంగా బియ్యపిండి. ఈ రెండింటిని కలిపి రాస్తే ఫేస్ క్లీన్ అయి మంచి గ్లో వస్తుంది. అంతే కాకుండా గ్లాసీ స్కిన్ మీ సొంతమవుతుంది. మరి ఈ రెండింటితో కలిపి ఫేస్ మాస్క్‌ని రెడీ చేసుకోవచ్చు. కొరియన్ స్కిన్ కేర్‌లో రైస్, రైస్ ఫ్లోర్ చాలా ముఖ్యం. ఈ రైస్ పాడర్‌ని సరైన విధంగా రాస్తే స్కిన్ మెరుస్తుంది. బియ్యం పిండిలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలో తేమని అలానే పెంచుతుంది. బియ్యం పిండిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్‌ని దూరం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్‌ని దూరం చేస్తాయి. ఇది ముడతలని తగ్గిస్తుంది. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. పాలు మంచి హైడ్రేటర్. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. చర్మం పొడిబారినట్లు అనిపిస్తే ముఖానికి పాలు రాయాలి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు, వయస్సు తాలుకూ మచ్చల్ని తగ్గిస్తాయి. పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యుని నుంచి వచ్చే హానికర యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మొటిమలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. ఈ మాస్క్ ఎలా చేయాలంటే ముందుగా గ్లాసు పాలు తీసుకోండి. ఫ్యాట్ మిల్క్ అయితే మంచిది. ఆ తర్వాత ఓ గిన్నెలో మూడు టీ స్పూన్ల బియ్యపిండి వేసి సరిపడా పాలు వేసి వేడి చేయాలి. ఇది చక్కగా క్రీమ్ అయ్యే వరకూ అలానే ఉంచండి. కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి చర్మాన్ని గ్లాసీ స్కిన్ ఉండేలా చేస్తుంది.
Read Also..
Read Also..