ప్రస్తుతం కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీనివల్ల సహజ సిద్ధంగా లభించే మంచినీటిని కూడా తాగలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది మినరల్ వాట్ అంటూ బాగా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. మినరల్ వాటర్ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో అమ్మే ప్రతి బాటిల్ మినరల్ వాటర్ కాదు. ఈ పేరుతో డిస్టిల్డ్ వాటర్ ను అమ్ముతుంటారు. కొనేటప్పుడే చూసుకొని కొనుక్కోవాలి. భూగర్భ వనరుల నుంచి నీటిని తీసుకొని వాటిని శుద్ధి చేసి కావల్సిన మినరల్స్ ను కలుపుతారు. తర్వాత ఈ నీటిని ప్యాక్ చేసి సహజమైన మినరల్ వాటర్ గా అమ్ముతారు. ముఖ్యమైన ఖనిజాలు ఆ నీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డిస్టిల్డ్ వాటర్ అనేది ఎక్కడైనా నీటిని వనరు నుంచి నీటిని తీసుకొని ఆవిరిగా మారేవరకు వేడిచేస్తారు. ఆవిరిని చల్లబరిచి మళ్లీ నేరుగా మారుస్తారు. సూక్ష్మక్రిములు ఉండవు. దీన్ని తాగకూడదు. ఎందుకంటే ఇందులో మినరల్స్ ఉండవు. అవసరమైన ఖనిజాలే ఉంటాయి. దీన్ని తాగడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది.
మినరల్ వాటర్ తాగుతున్నారా..అయితే ఇది తెలుసుకోండి!
88
previous post