82
వయస్సు పైబడిన వారేకాదు యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్నవారుగోజీ బెర్రీలను డైట్‌లో తీసుకోవడం మంచిది. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. రోజుకో పది ఎండు గోజీ బెర్రీలను తింటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్ళల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా కాపాడుతాయి. గోజీ బెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్ హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసిన యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో తెలిపారు.