పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలను బలహీనంగా, పెళుసుగా మార్చే బోలు ఎముకల వ్యాధి రిస్క్‌ను నివారిస్తుంది. పనీర్‌లో భాస్వరం కూడా ఉంది. ఇది ఎముకల బలోపేతానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. పనీర్‌లో ప్రొటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఇతర సోర్స్ నుంచి ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పనీర్ వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మాంసంలో ఉండే ప్రొటీన్‌తో సమానం. శరీరంలోని కణజాలాలు, ఎంజైములు, హార్మోన్స్, కండరాల నిర్మాణం, మరమ్మత్తులో ప్రోటీన్ పాత్ర కీలకం. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. పనీర్ ఐటెమ్స్ తింటే ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని అందిస్తుంది. ఫలితంగా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఈ మిల్క్ ప్రొడక్ట్ నుంచి జింక్ కూడా లభిస్తుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ పాత్ర కీలకం. ఇది ఇన్ఫెక్షన్స్, వ్యాధులతో పోరాడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే రోజుకు గరిష్టంగా 100-200 గ్రాముల పనీర్ మాత్రమే తీసుకోవాలని, అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం కంటెంట్ పనీర్‌లో తగినంత ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. ఇవి మంచి కొవ్వులు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడంలో వీటి పాత్ర కీలకం. పనీర్‌లో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
Read Also..
Read Also..