కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. రోజూ లీటర్‌కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి చేటనే వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు. కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మోతాదు మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది. కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్స్‌ను మితి మీరి తాగడం మంచిది కాదు.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..!
73
previous post