ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను. కారణము సుస్పష్టమే! చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు. మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశరూపబ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను. పదహారు, నూరు, వెయ్యి అనెడి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధరీతిగా గణింపబడి 116, 1116 అనెడి రూపము నందినవి. వీటిని పదిచే భాగించిన యెడల సృష్టి యందలి వివిధ వస్తుసముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను రెండు పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను మూడు పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణము దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను మూడింటిని దానము చేసినవాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండదానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రీ – త్రిష్టుప్ – జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్ నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన యీ పిండాండదానము (శరీర దానము) వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దానఫలము లభించును.
దేవతల వివిధ స్వరూపములు..
95
previous post